1800 425 568    info@paatasala.net

Admissions to PAATSALA for the Academic Year 2017_18


పాఠశాలకు సుస్వాగతం

కాలిఫోర్నియాలో నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ 501 సి (3) సర్టిఫికెట్‌ పొందిన 'పాఠశాల ఇంక్‌' గత మూడేళ్ళుగా చిన్నారులకు తెలుగు భాషను సులభంగా నేర్పించేందుకు 'పాఠశాల'ను వివిధ కేంద్రాల్లో ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తోంది.

6 సంవత్సరాలలోపు చిన్నారులకోసం ప్రత్యేకంగా 'తారంగం తారంగం' పేరుతో కోర్సును బోధిస్తోంది.

ఎన్నారై పిల్లలు తెలుగును సులభంగా నేర్చుకునేందుకు, వారికి అనుగుణంగా ఉండేలా కోర్సులను ఎంపిక చేయడం జరిగింది. జూనియర్‌, సీనియర్‌ పేరుతో ఏర్పాటు చేసిన కోర్సుల వల్ల విద్యార్థులు సులభంగా తెలుగును నేర్చుకోవచ్చు.

పాఠశాలలో జూనియర్‌ లెవెల్‌ కోర్సు 3 సంవత్సరాలు, సీనియర్‌ లెవెల్‌ కోర్సు మరో 3 సంవత్సరాలు ఉంటుంది.

జూనియర్‌ లెవెల్‌ కోర్సులో తెలుగు పలుకు, తెలుగు అడుగు 1, తెలుగు అడుగు 2 ఉంటాయి.

సీనియర్‌ లెవెల్‌ కోర్సులో తెలుగు పరుగు 1, తెలుగు పరుగు 2, తెలుగు వెలుగు ఉంటాయి.

పాఠశాల అడ్మిషన్‌ నియమనిబంధనలు :

 • పాఠశాల నాన్‌ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ కాబట్టి, ఆర్థిక వ్యవహరాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. అందువల్ల చిన్నారుల తల్లితండ్రులు తమ చిన్నారుల ఫీజులను పే పాల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.
 • ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌ చెల్లించేటప్పుడు పూర్తి వివరాలను అందించకపోతే దానికి పాఠశాల బాధ్యత వహించదు. ఒకవేళ ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌ చెల్లించలేని పక్షంలో తల్లితండ్రులు తమ చిన్నారుల పూర్తి వివరాలతో దరఖాస్తును నింపి చెక్‌ ద్వారా కూడా పేమెంట్స్‌ చెల్లించవచ్చు.
 • ఉత్తర అమెరికాలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ నెల నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. జూన్‌ వరకు జరుగుతాయి. మీరు చెల్లించే ఫీజులు ఒక్క సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది.
 • పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి కోర్సుకు సంబంధించిన టెక్స్ట్‌బుక్స్‌ను అందించడం జరుగుతుంది.
 • ప్రతి విద్యార్థి ఇ లెర్నింగ్‌కు సంబంధించిన శిక్షణకు అర్హుడు. పాఠశాల బోధనను ఆన్‌లైన్‌ ద్వారా కూడా ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు.
 • ప్రతి విద్యార్థి పాఠశాల టైమింగ్స్‌ను విధిగా పాటించాలి. పాఠశాల కేంద్రాల నిర్వాహకులు, టీచర్లు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. క్లాస్‌వర్క్‌లోనూ, హోమ్‌వర్క్‌లోనూ టీచర్ల నుంచి సలహాలను సూచనలను పొందవచ్చు.
 • ప్రతి వారం, ప్రతి నెలా జరిగే టెస్టులకు విద్యార్థులు హాజరై పరీక్షలు రాయాలి. మార్కుల ప్రాతిపదికగానే విద్యార్థికి పై తరగతులకు వెళ్ళేందుకు అర్హత లభిస్తుంది.
 • పాఠశాల కేంద్రాల నిర్వహణకు అవసరమైన వలంటీర్లకోసం లేదా, టీచర్ల నియామకం వంటి విషయాల్లో చిన్నారుల తల్లితండ్రులు సహకారాన్ని అందించవచ్చు.
 • తమ చిన్నారులు చదువుతున్న పాఠశాలలో కనీసం ఓ సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌లోనైనా తల్లితండ్రులు వలంటీర్‌గా ఉండాలని కోరుకుంటున్నాము.
 • పాఠశాల వీలైనంతవరకు తమ చిన్నారులను ఇతర సాంస్కృతిక ప్రదర్శనలలో, ఇతర ఈవెంట్స్‌లలో పాలుపంచుకునేలా కృషి చేస్తుంది. ప్రోత్సహిస్తుంది కూడా.
 • వివిధ నగరాల్లో ఉన్న పాఠశాల కేంద్రాలు ప్రతి సంవత్సరం 'వసంతోత్సవం' పేరుతో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో విద్యార్థుల టాలెంట్‌ను బయటపెట్టేలా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు.
 • పాఠశాల కేంద్రాలకు సంబంధించినంతవరకు టీచర్లు, సెంటర్‌ కో ఆర్డినేటర్లు, ఏరియా డైరెక్టర్ల నిర్ణయాలే అంతిమం. ఇందులో ఇతర ఆలోచనలకు, మాటలకు తావు లేదు.

రీఫండ్స్‌కు సంబంధించి :

 • పాఠశాల మేనెజ్‌మెంట్‌ ప్రతి కోర్సుకు ఆయా కేంద్రాలను బట్టి తగిన ఫీజును నిర్ణయిస్తుంది. ఈ ఫీజులనే తల్లితండ్రులకు కట్టాల్సి ఉంటుంది.
 • ఒక్కసారి ఫీజు చెల్లించిన తరువాత వాటిని వెనక్కి ఇవ్వడం కుదరదు. సహేతుకమైన కారణాలను వివరించి ఫీజులను వాపసు చేయాల్సిందిగా కోరినప్పుడు పాఠశాల మేనెజ్‌మెంట్‌ దానిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటుంది.
 • విద్యార్థుల తల్లితండ్రులు పూర్తి ఫీజును అడ్మిషన్‌ సమయంలోనే చెల్లించాలి.
 • విద్యాసంవత్సరం ప్రారంభమైన 7 రోజుల లోపుగా ఫీజు వాసప్‌ చేయాల్సి వస్తే కేవలం 25 డాలర్లు తగ్గించి ఫీజును వాపసు చేయబడుతుంది.
 • విద్యాసంవత్సరం ప్రారంభమైన 30 రోజుల్లోగా ఫీజు వాసప్‌ చేయాల్సి వస్తే కట్టిన ఫీజులో 50శాతం మాత్రమే చెల్లించబడుతుంది.
 • 30 రోజుల తరువాత ఫీజుల వాపసుకు సంబంధించి వినతులను పరిశీలించడం జరగదు.
 • ఫీజులు వాపస్‌ చేయాలని కోరుకునే తల్లితండ్రులు పాఠశాల నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాము.

New Student

REGISTER FROM HERE

Existing Student

Quick Links

Like Us On Facebook

Give Your Feed Back

Address

Jayaram Komati 408 406 8057

Subba Row V Chennuri 317 544 9122

Telugu Times - San Jose Office 68, South Abel Street Milpitas, CA 95035

Paatasala - Location Offices Click Here for the details of Resident Directors

Email paatasala@telugutimes.net